
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.