తనను దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్ కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బిజెపి తనను టార్గెట్ చేసిందని మంత్రి అజహరుద్దీన్ దుయ్యబట్టారు.

