తాజా ఓటమితో కివీస్ సెమీఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టం అయ్యాయి. సూపర్ 8లో ఒక్కో విజయం, ఓటమి (మరో మ్యాచ్ రద్దు)తో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఫలితంతో పాకిస్థాన్ సంతోషంగా ఉంది. కివీస్ ఓడడంతో పాక్ సెమీస్ రేస్‌లో ఉంది. రేపు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో నెగ్గితే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం కివీస్ రన్‌రేట్ +1.390 (3 పాయింట్లు)తో ఉండగా, పాకిస్థాన్ -0.461 (1 పాయింట్) మూడో ప్లేస్‌లో ఉంది.

