కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించారన్న వార్త తెలిసిన వెంటనే, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతం, ఆలయంలో రద్దీకి కారణాలు, భక్తుల భద్రత వివరాలు ఆరా తీశారు. నేటి దర్శనాల సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందని అధికారులను, ఆలయానికి సంబంధించిన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

