శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 10మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కార్తీక మాసం,
ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు తరలివచ్చారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

