
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు కోరారు. శుక్రవారం ఆయన సచివాలయానికి వెళ్లి సిఎస్ రామకృష్ణరావును కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ.. కెసిఆర్, హరీష్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్లు రశీదులు తీసుకున్నారు.
హరీశ్‌రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని సిఎస్ చెప్పినట్లు సమాచారం.