ఖమ్మం జిల్లాలోని గణేశ్పాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దులగూడెంలోని సుమారు వందమంది విద్యార్థులతో వెళ్తున్న వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. వేగంగా బస్సు నడపడంతో అదుపు తప్పి కాల్వలోకి పల్టీ కొట్టినట్లు.. స్థానికులు చెబుతున్నారు. కాల్వలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని విద్యార్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

