అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత హర్మూజ్ జలసంధిని దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా జగ్ విక్రమ్ నిలిచింది. ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో భారత్‌కు బయల్దేరింది. సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జలసంధిని దాటిన ఈ నౌక మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించింది. ఈ గ్యాస్ ట్యాంకర్ 20 వేల టన్నుల ఎల్పీజీని తీసుకురానుంది.

