కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు (DD01N9490) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. అయినా కాసులకు కక్కుర్తి పడిన ట్రావెల్స్ యాజమానులు కాలం చెల్లిన బస్సుతోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. బస్సు ఫిట్‌నెస్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంలో ఇప్పటి వరకు ఓ కుటుంబం సహా 20 మంది సజీవ దహనమయ్యారు.

