చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ పై శనివారం ఉదయం దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కానిస్టేబుల్ పై దాడి చేయడం సంచలనంగా మారింది. కార్వేటి నగరంలో విధులు నిర్వహిస్తున్న యుగంధర్ తన ద్విచక్ర వాహనంపై భార్యను స్కూలుకి తీసుకెళ్లాడు. అక్కడ దింపి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అతన్ని అడ్డగించి కొట్టి గాయపరచారు. దాడికి కారణాలపై విచారిస్తున్న కార్వేటి నగరం పోలీసులు.

