
తిరుపతి సమీపంలోని తిరుచానూరు లో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూశారు.. లోపల ఇద్దరు యువకుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. కారులో ప్రాణాలు కోల్పోయిన యువకుల్ని తిరుచానూరుకు చెందిన వినయ్, దీలీప్‌గా గుర్తించారు.. వారిద్దరు అన్నదమ్ములని సమాచారం. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు కారులోపల యువకుల మృతదేహాలు ఉంటే.. కారు బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.