
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రోల్ మోడల్ కాదని, రాంగ్ మోడల్ అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. ఎడ్లబండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు దానిపై రాజకీయ లబ్ధి పొందాలని చూడటం విడ్డూరంగా ఉందని అన్నారు.