కాండ్లా సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని గాంధీధామ్ సిటీలోగల కాండ్లా సెజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

