కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక విద్యాసంస్థలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రాజెక్టులకు టెండర్లు ఎలా పిలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

