
అంబేద్కర్ విదేశీ విద్యా నిధి కింద ఉన్నత చదువుల కోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి గతంలో ప్రతి ఏటా 90 మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు. ఈ విద్యా సంవత్సరం 32 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
దరఖాస్తుల పరిశీలన చేసి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిటీ విదేశాలకు వెళ్లే విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఇంకా కమిటీ వేయలేదని, గత సంవత్సరం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల ఖాతాలలో ఇప్పటి వరకు విద్యానిధి నగదు జమ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే.