అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు, మరి ఆ ఫైల్ ఎక్కడుంది? అది ఎఫ్ఎస్ఎల్ (FSL) అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? అని అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి పట్టుకోవడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేయాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

