కాంగ్రెస్‌ను శివుడితో.. బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ..వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి శివుడి పోలిక ఉందన్న రాహుల్.. మహా శివుడు తన శరీరంలో సగభాగాన్ని మహిళకు ఇచ్చి.. నిరాడంబరంగా..
అడిగితే ఇచ్చే విధంగా ఉంటాడని తెలిపారు. ఇక శివుడి వద్ద త్రిశూలం ఉండి కూడా.. అది ఆయన వెనకే ఉంటుందని పేర్కొన్నారు.విష్ణువు లాగా బీజేపీ పార్టీ ఆడంబరంగా.. కేవలం అధికారంపై మాత్రమే దృష్టి పెట్టే విధానాన్ని అనుసరిస్తుందని విమర్శలు చేశారు.

