
కల్వకుంట్ల కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ… కల్వకుంట్ల కవిత మరో వైఎస్ షర్మిల కాబోతుందనే అనుమానం కలుగుతుందని చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాలు కల్వకుంట్ల కుటుంబ పంచాయితీనా?, రాజకీయ వారసత్వ పంచాయితీనా?, ఆస్తుల పంచాయితీనా? తెలియాల్సి ఉందన్నారు. ‘మే 2వ తేదీన కవిత రాసిన లేఖ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ప్రజలలో ఎందుకింత చర్చనీయాంశంగా మారింది?. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తన రాజకీయ వారసుడి కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పారు.