
ప్రభుత్వ పెద్దలపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. బిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలిపి తననే విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తుందని మల్లన్న ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ రాకంటే ముందే కవిత సంబరాలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలు
ఆమెకు అండగా నిలవడం చూస్తుంటే కవిత కాంగ్రెస్ ములాకత్ కావడం అని స్పష్టమవుతుందన్నారు.