బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి ఈ షో ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. పేరుకు ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా టైటిల్ రేసు మాత్రం ప్రధానంగా ఇద్దరి మధ్యే ఉంది. వాళ్లిద్దరే పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి. ఈ క్రమంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఏవైనా మార్పులు సంభవించే అవకాశముంది.

