ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా బురదవేసి కడుక్కోమంటున్నారని విమర్శించారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మంగళవారం నాడు వైఎస్ జగన్ను సమావేశమయ్యారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లాయర్లు అందించిన సేవను ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేశారు.

