
ఏఐ సాయంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉమాలా వీడియో కాల్స్ రూపొందించి, టీడీపీ నాయకులను మభ్యపెట్టారు. వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి “చంద్రబాబుగారు మీతో మాట్లాడుతారు” అంటూ మరో వీడియో కాల్లో చంద్రబాబు లాగా ఉన్న వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తి “సీఎంను కలవాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలుగా ఇవ్వాలి” అని చెప్పడంతో నాయకులకు అనుమానం వచ్చింది. అసలు విషయం తెలిసిన ఖమ్మం టీడీపీ నేతలు ఇబ్బందికి గురై, ఫిర్యాదు చేయకుండా వెనుదిరిగినట్లు సమాచారం.