ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై మంటల్లో కాలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది వరకు సజీవ దహనం అయ్యారని సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహన మయ్యారు. 12 మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది.

