మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన తల్లీ మంగ సంధ్యారాణి(43), కుమార్తె మంగ చందన(23) ప్రాణాలు కోల్పోయారు. మస్కట్‌లో వుంటున్న ఆనంద్ కుమార్‌గౌడ్ భార్య సంధ్యారాణితో కలిసి హైదరాబాద్ వచ్చి మస్కట్‌కు వెళ్లే సమయంలో సంధ్యారాణికి జ్వరం రావడంతో వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలోనే కూతురు చందనను బెంగళూరులో వదిలి పెట్టి అక్కడి నుంచి తిరిగి మస్కట్ వెళ్లేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్‌లో బెంగళూరు వెళ్తుండగా ఊహించని ప్రమాదంతో తల్లీ కూతురు ప్రాణాలు విడిచారు

