కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి . పైగా సజీవదహనం అయిన కావేరి ట్రావెల్ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. దీనికి సంబంధించి రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాదిన్నర కాలంలో అనగా.. 2024, జనవరి 27 నుంచి.. 2025, అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించగా.. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ విభాగంలోనూ బస్సు మీద చలాన్లు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ అధికారులు.

