ప్రమాదంలో 20 మంది వరకు సజీవ దహనం కావడంపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. అదే విధంగా గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

