కర్నూలు వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1,622 కోట్లతో శీతలపానీయాల పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుతో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఓర్వకల్లు ఏపీఐఐసీ ల్యాండ్ లో పరిశ్రమ ఏర్పాటు చేస్తారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తారు. 2026 డిసెంబర్ లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థకు గడువు విధించారు.

