
ఇంధన ధరల పెంపు, టోల్ ప్లాజాల వద్ద వేధింపులను నిరసిస్తూ కర్ణాటకలో ట్రక్కు యజమానులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంగ్రెస్ సర్కార్ తమ గోడు పట్టించుకోవటం లేదంటూ ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ లారీ ఓనర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను చేపడుతున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. నిత్యావసరాల్ని రవాణా చేసే దాదాపు 6 లక్షల ట్రక్కుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.