
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో టెక్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో కంపెనీలు ఉద్యోగులకు మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇవ్వగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ిలికానీ వ్యాలీగా గుర్తింపు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. 20 రోజులుగా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి.