తమిళనాడులో తీవ్ర విషాదం మిగిల్చిన కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, నటుడు విజయ్ సిబిఐ విచారణ ముగిసింది. విచారణ కోసం సోమవారం విజయ్, ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆరు గంటలపాటు సిబిఐ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు చెందిన పలువురు ఆఫీసు బేరర్లను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో సిబిఐ.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.

