ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే ఇద్దరు చిన్నారులను తండ్రి శ్రీశైలం హత్య చేశాడని, చిన్నారి హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కరీంనగర్ లో కచ్చు శ్రీశైలం-మౌనిక దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు కావడంతో భర్తతో పాటు అత్తమామ, మరది మౌనికను పలుమార్లు వేధించారు. ఇద్దరు ఆడ పిల్లలను చంపాలని కన్నతండ్రి, నానమ్మ, తాతయ్య, బాబాయ్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఊరు వెళ్లగా శ్రీశైలం వారిని బావిలోకి తోసి హత్య చేసాడు.

