కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల డ్రస్సెస్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే పక్కనున్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో బట్టల దుకాణంతో పాటు వినాయక ఎంటర్ప్రైజెస్, ఫొటోగ్రఫి షాపు, కెనాన్ ఫొటోగ్రఫి దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

