బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ ఫ్యాక్టరీలలో సుదీర్ఘకాలం విజయవంతంగా పనిచేసిన F.02 రోబోల సేవా కాలాన్ని ముగించాలని కంపెనీ భావించింది. ఎలాంటి వీడ్కోలు ఇస్తే బాగుంటుందని కంపెనీ సీఈఓ నెటిజన్లను అడిగారు. టెర్మినేటర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ స్పందిస్తూ.. వాటిని కరిగించేయండి అని సరదాగా సలహా ఇచ్చారు. దాంతో కంపెనీ ఆర్నాల్డ్ మాటను సీరియస్‌గా తీసుకుని నిజంగానే రోబోలను ఫిన్లాండ్లోని ఒక స్టీల్ ప్లాంట్‌కు తరలించి, సుమారు 75 టన్నుల కరిగిన లోహం ఉన్న ఫర్నేస్‌లోకి స్వయంప్రతిపత్తితో దూకేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరిగించివేసింది.

