
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, షో హోస్ట్ కపిల్ శర్మ కెనడాలో ‘కప్స్ కేఫ్’ రెస్టారెంట్‌పై తరచుగా కాల్పులకు తెగబడుతున్నారు. బుధవారం కూడా రెస్టారెంట్‌పై కాల్పులు జరిగాయి. నాలుగు నెలల వ్యవధిలో ఇది మూడో సారి. కారులో రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన దుండగులు తుపాకితో కాల్పులకు తెగబడుతున్నారు. అది కూడా రాత్రి వేళల్లోనే కాల్పులు జరుపుతున్నారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడి తామే చేసినట్లు ప్రకటించుకున్నారు.