
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి ఒకరు లగేజీతో రైలెక్కిన ఓ ప్రయాణికుడి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి బలవంతంగా బయటకు నెడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సదరు అధికారి ఓ యువకుడిని చెంపదెబ్బలు కొడుతూ, కదులుతున్న రైలు డోర్ నుంచి బలవంతంగా తోస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రయాణికులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న సదరు RPF అధికారిపై రైల్వే మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.