నారా లోకేష్ బుధవారం టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పలువురు నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేడర్‌తో మీటింగ్‌లు, గ్రీవెన్స్ కార్యక్రమాలు వరుసగా నాలుగు వారాలు నిర్వహించని నేతలను నారా లోకేష్ మందలించినట్లు సమాచారం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మీద నారా లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

