
టెక్ ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగంలో ప్రావీణ్యం సాధించాలని ‘చాట్ జీపీటీ’ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ కీలక సూచన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీల్లో కోడింగ్ పనుల కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం అనేక కంపెనీల్లో 50%పైగా కోడింగ్ పనులను ఏఐ నిర్వహిస్తోందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెక్ ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులంతా ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.