భారత్‌లో తన ఉనికిని మరింత విస్తరించుకునేందుకు, ఏఐ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు.. ఇక్కడి యూజర్లు అందరికీ సంవత్సరం పాటు ఉచితంగా ఈ చాట్‌జీపీటీ గో సేవల్ని అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఇది నవంబర్ 4 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులతో పాటుగా.. ఇప్పటికే ఉన్న చాట్‌జీపీటీ గో యూజర్లకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది.

