బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దర్భంగా ప్రచారసభలో రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో లబ్దిపొందడానికి ఏదో ఒక డ్రామా ఆడుతారని అయితే యమునా నదిలో స్నానం, కుంటలోకి స్వచ్ఛమైన నీళ్లను వదిలే పైపు ఫొటో బయటపడటంతో ఆ డ్రామా బెడిసికొట్టిందని, ప్రచార సభలో ఓ 200 మంది లేచి ఓట్ల కోసం డ్యాన్స్ చేయాలని ప్రధానిని కోరితే వెంటనే డ్యాన్స్ మొదలవుతుందని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఏకంగా భరతనాట్యమే చేస్తారని ఆయన విమర్శించారు.

