మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిరసనకారులు ఏడుగురు న్యాయాధికారులను గంటల పాటు ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి తరువాత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకుని, లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాయి. అనంతరం న్యాయాధికారులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో నిరసనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి కూడా యత్నించారు. కోల్కతా -సిలిగురి నేషనల్ హైవే-12ను కూడా బ్లాక్ చేశారు.

