దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. సోమవారం శీతకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

