
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా They Call Him OG (ఓజీ) షూటింగ్ పూర్తయింది. తాజాగా మూవీ యూనిట్ నుండి వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ చివరి రోజు తీసిన ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్, ఇతర సిబ్బంది ఉన్నారు. అభిమానులను ఉత్సాహపరిచిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.