
‘ఓజీ’ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమా క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్యను ఎక్స్ట్రా ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలని దర్శకుడు సుజీత్ డిమాండ్ చేశారని, దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని సదరు పుకార్ల సారాంశం. వాటిని సుజీత్ ఖండించారు. మేకింగ్ విషయంలో నిర్మాత డీవీవీ దానయ్యతో పాటు చిత్ర బృందం తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని, అది మాటల్లో చెప్పలేనని సుజీత్ పేర్కొన్నారు. ఆయన ఓ లెటర్ విడుదల చేశారు. ఆ లేఖలో పుకార్లను ఖండించారు