
“వన్ నేషన్ – వన్ ఎలక్షన్” విధానం దేశ ప్రయోజనాల కోసం అవసరమైన, ఆర్థిక ఖర్చులను తగ్గించే, పాలనా సామర్థ్యాన్ని పెంచే చర్యగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఒకే దేశం – ఒకే ఎన్నిక వర్క్ షాప్‌నకు పవన్ హాజరయ్యారు. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఈ విధానానికి మద్దతు ఇచ్చారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దానిని వ్యతిరేకిస్తున్నారని, ఇది విచారకరమని పేర్కొన్నారు.