రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట్ వద్ద ఒఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడడంతో డిఆర్ డిఒ, హయత్ నగర్ లో వివిధ ఆస్పత్రులకు తరలించారు. న్యూ గో ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పైనుంచి కిందకు దిగుతుండగా మూలమలుపు వద్ద బోల్తాపడింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

