ఐసిసి తాజాగా టి-20 ర్యాంకింగ్స్‌ని ప్రకటించింది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్-5లోకి వచ్చేశాడు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (753), భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (740) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. బుమ్రా ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 702 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరాడు.ఇక బ్యాటింగ్ విభాగంలో బ్యాటర్లు అభిషేక్ శర్మ (875), ఇషాన్ కిషన్ (871) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తిలక్ వర్మ 742 పాయింట్లతో ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

