
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ తేజస్ కారియా, నటి ఐశ్వర్య రాయ్ పేరు, ఫోటోలు, ఇతర వ్యక్తిగత లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం ద్వారా అయినా దుర్వినియోగం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు నటి ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.