టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ సైట్ యజమాని రవిని పోలీసులు అరెస్ట్ చేయడం సంతోషం కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పైరసీ అనేది సినీ పరిశ్రమకు ఛాలెంజింగ్‌గా మారింది. సినిమాను నమ్ముకొని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పైరసీపై యుద్ధం జరుగుతూనే ఉండాలి అని చిరంజీవి అన్నారు. అలాగే రాజమౌళి మాట్లాడుతూ.. ఐబొమ్మ రవి అరెస్ట్ ఒక సినిమా సీన్లా ఉందన్నారు. రవి అరెస్ట్‌లో పోలీసుల చొరవకు ధన్యవాదాలు తెలిపారురాజమౌళి. హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు నిర్మాత దిల్ రాజు.

