సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి ఊరట లభించింది. నిరుడు నవంబర్ 16 నుంచి అతడు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ హైకోర్టు మంగళవారం రవికి షరుతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
దేశం విడిచి వెళ్లొద్దని, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని అతడికి హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇంటర్నెట్ ఉపయోగించవద్దని.. ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని రవికి తెలియజేసింది.

