ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ-బొమ్మకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొత్త దశకు చేరుకుంది. ఇప్పటివరకు సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణలో బయటపడిన ఆర్థిక లావాదేవీలు, విదేశీ ట్రాన్సాక్షన్లు, బెట్టింగ్ యాప్‌లతో ఉన్న సంబంధాలు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈడీ అధికారులు హైదరాబాదు పోలీసు కమిషనర్‌కు అధికారిక లేఖ రాసి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదులు, స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలు అందించాలని కోరారు.

